జయం రవి ” యమపాశం ” ఆడియో రిలీజ్

తమిళ్ లో ఇప్పటి వరకూ రాని జాంబీ ( నడుస్తున్న శవాలు ) కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ మిరుతన్ ‘ సినిమా తెలుగులో ‘ యమపాశం ‘ పేరుతో రాబోతోంది. జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం తెలుగు ఆడియోను hero నాని ,ఎడిటర్ మోహన్ , పోసాని కృష్ణ మురళి ,హీరో జయం రవి  , నాగినీడు,నిర్మాత శోభ రాణి  రిలీజ్ చేసారు .  మామగారు, బావ బావమరిది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడైన ఎడిటర్ మోహన్ తనయుడు  జయం రవి , లక్ష్మి మీనన్  ముఖ్య పాత్రలలో  నటించి  తమిళనాట  “మిరుతన్ “   గా  రిలీజ్ అయ్యి  సంచలన విజయం సొంతం చేసుకొని ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుట ఫిబ్రవరి 19న ఈ సినిమా విడుదల కానుంది.
శక్తి సౌందర్ రాజన్ తీసిన ఈ జాంబీ మూవీ, ఈ జానర్ లో ఇండియాలోనే రెండోది కావడం విశేషం. మొదటిది గో గోవా గాన్ పేరుతో సైఫ్ అలీఖాన్ హీరోగా వచ్చింది. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో మాత్రమే ఈ తరహా చిత్రాలు వచ్చేవి. ఒక వైరస్ ప్రపంచమంతా వ్యాపించి, మనుషుల్ని నరమాంస భక్షకులుగా మార్చేస్తే, ఆ వైరస్ నుంచి మిగిలిన వాళ్లను కాపాడటమెలా అనేదే జాంబీ కథాంశం. హాలీవుడ్ వాళ్లకు ఇవి రొటీన్ అయిపోయినా, ఇండియాకు మాత్రం ఇవి కొత్తే..

యమపాశం ఆడియో రిలీజ్ లో

హీరో  నాని మాట్లాడుతూ…  ట్రైలర్ చూసి  యమ పాశం సినిమా  ఎప్పుడప్పుడు  చూస్తాన అని  ఎంతో థ్రిల్లింగ్  గా ఉందని … తెలుగు లో మొదటిసారి గ  యమపాశం సినిమా ద్వారా అరంగ్రేటం చేస్తున్న హీరో జయం రవి కి   శుభాకాంక్షలు  తెలిపుతూ …జాంబి జోనర్ తో రాబోతున్న యమపాశం సినిమా తప్పకుండ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్టు  తెలిపారు …

పోసాని కృష్ణ మురళి  మాట్లాడతూ ...ఎడిటర్ మోహన్ గారి లాంటి నిర్మాతలు తెలుగు సినిమా కు ఎంతో అవసరం అని అయన తిరిగి తెలుగు సినిమాలు నిర్మించాలని …చెప్తూ జయం రవి కి తన శుభాకాంక్షలు తెలిపారు …

హీరో జయం రవి మాట్లాడుతూ ….   ఓ సైంటిఫిక్‌ వైరస్‌ వల్ల మనుషుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కింది యమపాశం . ఈ సినిమా ఏ భాషలోనైనా హిట్టవుతుందనే నమ్మకంతోనే తెలుగులోకి తిసుకోస్తన్నాం … తెలుగు మొట్టమొదటి సారిగా యమపాశం సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని దీనికి తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరియు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నాని తెలిపారు. మరి జయం రవి “యమ పాశం “ సినిమా  తో తెలుగులోనూ ఈ హీరో జయం అందుకుంటాడో లేదో చూడాలి.

 

8x8 copy

DSC03765

DSC03780

DSC03811

DSC03814

DSC03820

DSC03832

DSC03833

DSC03849

DSC03853

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *