తుంటరి చిత్రం ప్రెస్ రిలీజ్

ప్రస్తుతం తెలుగులోకి పరిచయం అవుతున్న దర్శకులలో 100 లో 80% మంది రెగ్యులర్ మూస ధోరణి సినిమాలను లేదా హిట్ ఫార్ములాని నమ్ముకొని దర్శకులుగా పరిచయం కావడానికి ఇష్టపడుతున్నారు. కానీ వీటికి భిన్నంగా ఎవరైతే ట్రై చేసి ఓ డిఫరెంట్ అటెంప్ట్ తో వావ్ అనిపించుకుంటారో వాళ్ళని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. అలా ఓ డిఫరెంట్ హార్ట్ టచింగ్ స్టొరీ అయిన ‘గుండెల్లో గోదారి’ లాంటి అచ్చ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కుమార్ నాగేంద్ర. ఇప్పటి వరకూ చేసింది రెండు సినిమాలే అయినా తన టాలెంట్ వలన మూడవ సినిమాకి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కుమార్ నాగేంద్ర చేసిన మూడవ సినిమా ‘తుంటరి’.

రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ఇష్టపడే నారా రోహిత్ హీరోగా నటించిన ఈ మూవీలో లత హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. జనవరి 29న రిలీజైన ఈ మూవీ ఫస్ట్ టీజర్ అందరినీ ఆకర్షించింది. మెయిన్ గా నారా రోహిత్ లుక్, ఫన్, ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న కొన్ని షాట్స్ మరియు స్టొరీ ఫ్లాట్ వలన సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. రీసెంట్ గా మీడియా మీట్ లో కుమార్ నాగేంద్ర ఈ సినిమా గురించి మరియు నారా రోహిత్ గురించి మనకు తెలియని సీక్రెట్స్ కొన్ని రివీల్ చేసాడు. ఆ అంశాలు సినిమాపై క్రేజ్ ని మరింత పెంచేలా ఉన్నాయి.

‘ఫస్ట్ టీజర్ లో కిక్ బాక్సింగ్ కి సంబందించిన కొన్ని షాట్స్ ఉన్నాయి.. దాన్ని చూసి ఇదేదో సీరియస్ కిక్ బాక్సింగ్ సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు.. అది సినిమాలో ఒక చిన్న సబ్ ఫ్లాట్ మాత్రమే.. మెయిన్ గా ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ టచ్ అందరినీ కట్టి పడేస్తుంది. నారా రోహిత్ ఈ సినిమాలో హ్యాపీ అండ్ కూల్ గోయింగ్ పర్సన్ గా కనిపిస్తాడు. ఇందులో కామెడీకి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర చేసాడు. అతని కామెడీ టైమింగ్ అందరినీ మెస్మరైజ్ చేయడమే కాకుండా కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగ్ ఏనారా రోహిత్ పాత్ర లో స్లిమ్ గా కనిపించడం కోసం 6 కిలోలు తగ్గాడు. హార్డ్ వర్కింగ్ కి మరోపేరు. టైట్ స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా సాగే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని’ కుమార్ నాగేంద్ర తెలిపాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంచుకున్న స్టేట్మెంట్ ‘హార్డ్ వర్క్ Vs డెస్టినీ’.. మరియు నారా రోహిత్, కుమార్ నాగేంద్రల హార్డ్ వర్క్ కి డెస్టినీ ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *