సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రం మొదటి రోజు వసూళ్ళు అంచనా

రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ,ఈ చిత్రం నేడే విడుదల అయింది . ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి . ఇప్పటికే మూడు హిట్ చిత్రాలు కొట్టిన రాజ్ తరుణ్ ,ఈ సారి కూడా హిట్ కొడతాడో లేదో అనే ఆశక్తికలుగుతుంది .

ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచి ఏదో బానే ఉంది అన్న స్పందన వచ్చింది , ఇక చిత్రంలోని పాటల చిత్రానికి హైలైట్గా నిలిచాయి . ఇక మొదటి రోజు వసూళ్ళు మట్టికి బాగానే ఉండవచ్చు అని అంచనా , ఎంతకాదన్న రెండు మరియు మూడు కోట్ల వసూళ్ళు సాధిస్తుంది అని తెలుస్తుంది . ఎలాగో రాజ్ తరుణ్కి తన ముందు చిత్రాలు విజయవంతం కావటంతో కొంత ఫాలోయింగ్ ఉండటం వలన శనివారము ,ఆదివారం కూడా బానే వసూళ్ళు చేస్తుందని అంచనా . మరి మొత్తంమీద , ఈ చిత్రం ముందు రోజుల్లో బాక్స్ ఆఫీసు వద్ద ఎంత సాదిస్తుందో చూడాలి మరి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *